కుమ్మరిపేటలో కింగ్‌కోబ్రా

ABN , First Publish Date - 2021-06-22T05:52:15+05:30 IST

మండలంలోని బొగాబెణి పంచాయతీ పరిధిలో గల కుమ్మరిపేటలో ఆదివారం రాత్రి కింగ్‌కోబ్రా హల్‌చల్‌ చేసింది.

కుమ్మరిపేటలో కింగ్‌కోబ్రా
కంచిలి: కుమ్మరిపేటలో సంచరిస్తున్న కింగ్‌కోబ్రా

కంచిలి: మండలంలోని బొగాబెణి పంచాయతీ పరిధిలో గల కుమ్మరిపేటలో ఆదివారం రాత్రి కింగ్‌కోబ్రా హల్‌చల్‌ చేసింది. పంట పొలాల నుంచి వచ్చిన  12 అడుగులు పొడవుతో ఉన్న కోబ్రాను వీధిలో స్థానికులు గుర్తించారు. వెంటనే  పాములు పట్టే వ్యక్తికి గ్రామస్థులు సమాచారం ఇచ్చారు. ఆయన  కోబ్రాను పట్టుకొని గ్రామానికి దూరంగా విడిచిపెట్టాడు. బూర్జ: మండలంలోని ఏటొడ్డుపర్త ప్రాథమిక పాఠశాల వద్ద రక్తపింజరి జాతికి చెందిన విషసర్పాన్ని గ్రామస్థులు సోమవారం హతమార్చారు. పాఠశాల వద్ద ఈ పాము కనిపించడంతో  భయాందోళన చెందారు. ఆ తర్వాత యువకులు దాన్ని చంపేశారు.
Updated Date - 2021-06-22T05:52:15+05:30 IST