కమనీయం.. గోదా రంగనాథుల కల్యాణం

ABN , First Publish Date - 2021-01-14T05:13:10+05:30 IST

జిల్లాలోని పలు ప్రాంతాల్లో భోగి పర్వదినం సందర్భంగా బుధవారం గోదా రంగనాథుల కల్యాణం కమనీయంగా నిర్వహించారు.

కమనీయం.. గోదా రంగనాథుల కల్యాణం
కవిటి: ప్రగడపుట్టుగ కోదండ రామాలయంలో గోదాదేవి కల్యాణంలో పాల్గొన్న ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్‌ తదితరులు

(ఆంధ్రజ్యోతి బృందం)

జిల్లాలోని పలు ప్రాంతాల్లో భోగి పర్వదినం సందర్భంగా బుధవారం గోదా రంగనాథుల కల్యాణం కమనీయంగా నిర్వహించారు. గడచిన నెలరోజులుగా ధనుర్మాసోత్సవాల సందర్భంగా తిరుప్పావై సేవలను నిర్వహించిన ఆలయాల అర్చకులు, నిర్వాహకులు బుధవారం గోదా రంగనాథుల కల్యాణంతో ఉత్సవాలు ముగించారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ఆలయాల నిర్వాహకులు, ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తరించారు.

Updated Date - 2021-01-14T05:13:10+05:30 IST