కలకలం

ABN , First Publish Date - 2021-11-03T05:20:56+05:30 IST

నగ రంలో ఓ వీధిలో ఆన్‌లైన్‌లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయంటూ విజయవాడ ఎస్‌ఈబీ ప్రధాన కార్యాల యానికి ఫోన్‌ వెళ్లింది.

కలకలం

ఆన్‌లైన్‌లో గంజాయి విక్రయిస్తున్నారంటూ విజయవాడ ఎస్‌ఈబీ అధికారులకు ఫోన్‌

 రంగంలోకి దిగిన జిల్లా ఎస్‌ఈబీ సిబ్బంది

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: నగ రంలో ఓ వీధిలో ఆన్‌లైన్‌లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయంటూ విజయవాడ ఎస్‌ఈబీ ప్రధాన కార్యాల యానికి ఫోన్‌ వెళ్లింది. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా ఎస్‌ఈబీ అధికా రులు రంగంలోకి దిగడంతో స్థానికంగా కలకలం రేగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మెహర్‌బాబా స్కూల్‌ సమీపంలోని తుమ్మావీధిలో ఓ రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి ఇంటిముందుమూడురోజులుగా ఓ పార్శిల్‌ పడిఉంది. దీన్ని రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి కుటుంబం గుర్తించింది. ఇదిలా ఉండగా..  రిటైర్డ్‌  ఉద్యోగికి చెందిన వ్యక్తులు ఆన్‌లైన్‌లో గంజాయిని విక్రయిస్తున్నారంటూ గుర్తుతెలియని వ్యక్తి విజయవాడ ఎస్‌ఈబీ ప్రధాన కార్యాలయానికి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో వెంటనే శ్రీకాకుళం ఎస్‌ఈబీ అధికారులు మంగళవారం రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి ఇంటి వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న పార్శిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అం దులో డ్రై గంజాయి ఉన్నట్లు నిర్ధారించారు. ఈపార్శిల్‌ ‘మీ ఇంటిముందుకు ఎలా వచ్చింది’ అని వారిని ఎస్‌ఈబీ అధికారులు ప్రశ్నించారు. మూడు రోజులుగా ఈ పార్శిల్‌ను చూస్తున్నామని.. ఎవరో ఉద్దేశ్యపూర్వకంగా ఇలా చేశారని వారు చెప్పారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఫోన్‌ నంబర్‌ను ఎస్‌ఈబీ అధికారులు ట్రేస్‌ చేసి.. కాల్‌ చేయగా ఫోన్‌స్విచ్చాఫ్‌ వచ్చింది. దీంతో ఎవరో ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేశారని ప్రాథమికంగా నిర్థారించారు. దీనిపై పూర్తిపరిశీలన చేస్తున్నామని.. సరైన ఆధారాలు లేకుండా ఎవ రినైనా అరెస్టు చేస్తే ఆ కుటుంబం బెయిల్‌ లభించక మరింత ఇబ్బందులకు గురవు తుందని ఎస్‌ఈబీ అధికారులు తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

 


Updated Date - 2021-11-03T05:20:56+05:30 IST