ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై జేసీ అసంతృప్తి

ABN , First Publish Date - 2021-12-29T05:23:13+05:30 IST

రైతుల నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై జేసీ ఆర్‌.శ్రీరాములునాయుడు అసంతృప్తి వ్యక్తంచేశారు. కరవంజ, పాగోడు గ్రా మ సచివాలయాలను మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. సచివాలయ పరిధిలోని రైతులు, కోతలు, నూర్పిడి వివరాలు లేకపోవడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై జేసీ అసంతృప్తి
కరవంజలో సూచనలిస్తున్న జేసీ శ్రీరాములునాయుడు

కరవంజ (జలుమూరు), డిసెంబరు 28: రైతుల నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై  జేసీ ఆర్‌.శ్రీరాములునాయుడు అసంతృప్తి వ్యక్తంచేశారు. కరవంజ, పాగోడు గ్రా మ సచివాలయాలను మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. సచివాలయ పరిధిలోని రైతులు, కోతలు, నూర్పిడి వివరాలు లేకపోవడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అడ్వయిజరీ సమావుశంలో సభ్యుల సంతకాలు లేకపోవడంపై ఆయన ప్రశ్నించారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లు 23 మంది ఉన్నప్పటికీ ఇరుకు గదిలో ఎలా విధులు చేపడుతున్నారని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుపై జేడీతో ఫోన్‌లో మాట్లాడారు. వలంటీర్‌ సాయికుమార్‌  బయోమెట్రిక్‌ వేయనందున విధుల నుంచి తొలగించాలని ఈవోపీఆర్డీ శ్యామలకుమారిని ఆదేశించారు. ఆయనతో పాటు  పంచాయతీ కార్యదర్శి రాజులు, సర్పంచ్‌ జుత్తు నేతాజీ ఉన్నారు.

 

Updated Date - 2021-12-29T05:23:13+05:30 IST