అక్రమంగా ఇనుము తరలింపు

ABN , First Publish Date - 2021-06-22T05:54:27+05:30 IST

కాకారపల్లి ఈస్ట్‌కోస్టు థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ నుంచి ఇనుమును అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గోవింద్‌ తెలిపారు.

అక్రమంగా ఇనుము తరలింపు

  వాహనాన్ని పట్టుకున్న పోలీసులు 

సంతబొమ్మాళి, జూన్‌ 21: కాకారపల్లి ఈస్ట్‌కోస్టు థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ నుంచి ఇనుమును  అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు  ఎస్‌ఐ గోవింద్‌ తెలిపారు. సూపర్‌వైజర్‌ బొద్దూరు ప్రసాదరావు ఫిర్యాదు మేరకు ఆదివారం అర్ధరాత్రి పవర్‌ ప్లాంట్‌కు చేరుకొని వాహనాన్ని పట్టుకున్నట్లు చెప్పారు.   టెక్కలికి చెందిన కోరాడ నాగభూషణరావు, సిలిన్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా, గత కొంత కాలంగా పెద్దల హస్తంతో పవర్‌ప్లాంట్‌ నుంచి అక్ర మంగా టన్నుల కొద్దీ ఇనుము సామానులు తరలిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తు న్నాయి. పోలీసులు  దృష్టి సారిస్తే అసలైన దొంగలు దొరికే అవకాశం ఉంది. Updated Date - 2021-06-22T05:54:27+05:30 IST