మే 5 నుంచి ‘ఇంటర్‌’ పరీక్షలు

ABN , First Publish Date - 2021-02-02T04:33:29+05:30 IST

ఇంటర్మీడియట్‌ పరీక్షలు మే 5 నుంచి జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం ఇంటర్‌ బోర్డు అధికారులు విడుదల చేశారు. కరోనా సమయంలో 30శాతం సిలబస్‌ను కుదించిన ప్రాప్తికే పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. మే 5 నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, 6 నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభించను

మే 5 నుంచి ‘ఇంటర్‌’ పరీక్షలు
నరసన్నపేట, ఫిబ్రవరి 1:
ఇంటర్మీడియట్‌ పరీక్షలు మే 5 నుంచి జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం ఇంటర్‌ బోర్డు అధికారులు విడుదల చేశారు. కరోనా సమయంలో 30శాతం సిలబస్‌ను కుదించిన ప్రాప్తికే  పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. మే 5 నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, 6 నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభించనున్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 24వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు నుంచి ఆదేశాలు అందాయని ఆర్‌ఐవో  ఎస్‌.రుక్మాంగధరావు ధ్రువీకరించారు.


Updated Date - 2021-02-02T04:33:29+05:30 IST