జగన్ పాలనలో బీసీలకు అన్యాయం
ABN , First Publish Date - 2021-11-28T06:23:06+05:30 IST
వెనుకబడిన తరగతుల వారికి సీఎం జగన్మోహన్‌రెడ్డి పాలనో అన్యాయం జరుగుతున్నదని యాదవ సంక్షేమ సంఘం అనకాపల్లి పట్టణ గౌరవ అధ్యక్షుడు బోడి వెంకటరావు అన్నారు.

యాదవ సంఘం పట్టణ గౌరవ అధ్యక్షుడు వెంకటరావు
అనకాపల్లి, నవంబరు 27: వెనుకబడిన తరగతుల వారికి సీఎం జగన్మోహన్‌రెడ్డి పాలనో అన్యాయం జరుగుతున్నదని యాదవ సంక్షేమ సంఘం అనకాపల్లి పట్టణ గౌరవ అధ్యక్షుడు బోడి వెంకటరావు అన్నారు. జగన్‌రెడ్డికి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. బీసీ జనగణన విషయమై 2014లో టీడీపీ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని చెప్పారు. ఇప్పుడు బీసీలను ఉద్దరించినట్టుగా జగన్‌రెడ్డి బీసీ గణన చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోత విధించడంతో 16 వేల మంది బీసీలకు పదవులు రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల స్థానంలో జగన్‌రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించుకున్నారని ఆరోపించారు. అలాగే బీసీల నిధుల నుంచి రూ.18 వేల కోట్లు మళ్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలకు దరఖాస్తులు చేసుకుంటే ఒక్కరికి కూడా రుణాలు మంజూరు చేయలేదని ఆయన వాపోయారు.