ఏకగ్రీవానికి నై.. సంగ్రామానికి సై..

ABN , First Publish Date - 2021-02-06T05:21:05+05:30 IST

తీలతో పాటు ఏజెన్సీలో గిరి జన గ్రామాలు చాలావరకూ గతంలో ఏకగ్రీవమయ్యేవి. ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు. గిరిజనుల్లో చైతన్యం పెరగడంతో ఎన్నికల్లో పోటీతత్వం పెరి గింది. చాలా పంచాయతీల్లో సంగ్రామానికి సై అంటున్నారు. అధికంగా యువ కులు బరిలో దిగుతు

ఏకగ్రీవానికి నై.. సంగ్రామానికి సై..




గిరిజన గ్రామాల్లోనూ పెరిగిన పోటీ
మెళియాపుట్టి :
మారుమూల పంచాయతీలతో పాటు ఏజెన్సీలో గిరి జన గ్రామాలు చాలావరకూ గతంలో ఏకగ్రీవమయ్యేవి. ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు. గిరిజనుల్లో చైతన్యం పెరగడంతో ఎన్నికల్లో పోటీతత్వం పెరి గింది. చాలా పంచాయతీల్లో సంగ్రామానికి సై అంటున్నారు. అధికంగా యువ కులు బరిలో దిగుతున్నారు. పార్టీల మద్దతుతో సంబంధం లేకుండా సర్పంచ్‌, వార్డు మెంబర్‌ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఉదాహరణకు మెళి యాపుట్టి మండలంలో గిరిజన పంచాయతీలు అయిన కేరాశింగిలో నలు గురు, ఇలాయిపురంలో ఐదుగురు, భరణికోటలో ముగ్గురు, గొట్టిపల్లిలో ముగ్గురు, పరశురాంపురంలో ఆరుగురు సర్పంచ్‌ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఓవైపు అధికార పార్టీ నేతలు ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. ఎన్నడూ లేని విధంగా గిరిజన గ్రామాల్లో సైతం పోటీతత్వం పెరగడం చర్చ నీయాంశమవుతోంది.


Updated Date - 2021-02-06T05:21:05+05:30 IST