అమరవీరుల స్మరణలో..

ABN , First Publish Date - 2021-11-01T05:14:01+05:30 IST

అమరవీరుల స్మరణలో..

అమరవీరుల స్మరణలో..

పోలీస్‌ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ శ్రీకాకుళం నగరంలో ఆదివారం సాయంత్రం పోలీసులు భారీ కవాతు నిర్వహించారు. అమర వీరుల వారోత్సవాల ముగింపు సందర్భంగా చేపట్టిన కవాతు నగరంలోని ప్రధాన కూడళ్ల మీదుగా కొనసాగింది. దేశభక్తి గీతాలను ఆలపిస్తూ పోలీసుల బలగాలు ముందుకు సాగాయి. అంతకు ముందు కవాతును ప్రారంభించిన అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు మాట్లాడుతూ అమరవీరుల ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. డీఎస్పీలు మహేంద్ర, శ్రీనివాసరావు, శేఖర్‌, అంబేద్కర్‌, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

-శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి

Updated Date - 2021-11-01T05:14:01+05:30 IST