హుండీల ఆదాయం 1.48 లక్షలు

ABN , First Publish Date - 2021-08-28T05:08:03+05:30 IST

శ్రీముఖలింగేశ్వరాలయ హుండీల ఆదాయం రూ.1,48,709 వచ్చినట్లు ఈవో జి.గురునాథరావు తెలిపారు.

హుండీల ఆదాయం 1.48 లక్షలు

శ్రీముఖలింగం (జలుమూరు) ఆగస్టు 27: శ్రీముఖలింగేశ్వరాలయ హుండీల ఆదాయం రూ.1,48,709 వచ్చినట్లు ఈవో జి.గురునాథరావు తెలిపారు. దేవదాయశాఖ పరిశీలకుడు డీవీ రవికుమార్‌ నేతృత్వంలో హుండీలను శుక్రవారం లెక్కించారు. అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.


శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకున్న ఐసీడీఎస్‌ ఆర్జేడీ 

 శ్రీముఖలింగేశ్వరస్వామిని ఐసీడీఎస్‌ ఆర్జేడీ  చిన్మయిదేవి శుక్రవారం దర్శించుకొని పూజలు చేశారు. ఆమెకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆమె గోత్రనామాలతో పూజలు చేయించారు. శేషవస్త్రాలు అందించి ఆశీర్వచనం చేశారు. అనంతరం వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. ఆలయ విశిష్టతను అర్చకులు వివరించారు. అంతకుముందు శ్రీముఖలింగంలోని అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసి  పౌష్టికాహారంపై ఆరా తీశారు. ఆమెతో పాటు ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పేడాడ సీతామహాలక్ష్మి, పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులున్నారు. 

 

Updated Date - 2021-08-28T05:08:03+05:30 IST