1 నుంచి ఒంటిపూట బడులు

ABN , First Publish Date - 2021-03-23T05:16:22+05:30 IST

హించాలని నిర్ణయించారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం

1 నుంచి ఒంటిపూట బడులు




ప్రభుత్వనిర్ణయం 

(సోంపేట)

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌ 1 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. ఏటా వేసవిలో ఎండల దృష్ట్యా మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది కొద్దిరోజుల పాటు ఒంటిపూట బడుల నిర్వహణ తరువాత కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు మూతపడ్డాయి. కొవిడ్‌ ఆంక్షలు సడలించిన తరువాత తెరుచుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రాథమిక పాఠశాలలను సైతం తెరిచారు. దీంతో సిలబస్‌ దృష్ట్యా ఒంటిపూట బడులు ఉండవని భావించారు. కానీ ఎండ తీవ్రత, పెరుగుతున్న కరోనా కేసులతో ఏప్రిల్‌ 1 నుంచి ఒక్కపూటే తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లాలో 3,828 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3.77 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసుల దృష్ట్యా పాఠశాలలను తెరవలేదు. మన రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 



Updated Date - 2021-03-23T05:16:22+05:30 IST