భామినిలో వడగళ్ల వర్షం

ABN , First Publish Date - 2021-05-03T05:03:22+05:30 IST

భామిని మండలంలో ఆదివారం వడగళ్ల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు పెనుగాలులతో వర్షం కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

భామినిలో వడగళ్ల వర్షం
ఇసుక కుప్పపై పరుపు పరిచినట్టుగా వడగళ్లు

భామిని, మే 2: భామిని మండలంలో ఆదివారం వడగళ్ల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు పెనుగాలులతో వర్షం కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బత్తిలి నుంచి ఘణసర వరకు కుండపోత వర్షం కురిసింది. భామిని, సింగిడి, బురుజోల, లివిరి, అనంతగిరిలో కూడ భారీగా వడగళ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై.. ఇళ్లల్లోకి వర్షపునీరు చేరింది. ఈదురుగాలుల ప్రభావానికి కొన్నిచోట్ల దుకాణాల పైకప్పులు ఎగిరిపోయాయి. 15 రోజుల కిందట అనంతగిరి, దిమ్మిడిజోల, బురుజోల, సింగిడి తదితర గ్రామాల్లో కురిసిన వడగళ్లవానకు మామిడి, జీడితోపాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా మరింత నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. పంట నష్టాన్ని గుర్తించి పరిహారం అందజేయాలని కోరుతున్నారు.  

 

Updated Date - 2021-05-03T05:03:22+05:30 IST