రూ.5 లక్షల విలువచేసే గుట్కా పట్టివేత

ABN , First Publish Date - 2021-10-25T05:46:38+05:30 IST

ఒడిశా నుంచి టెక్కలికి తరలిస్తున్న గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.5 లక్షలు ఉంటుంది. ఇందుకు సంబంధించి కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాలోని ఏడో మైలురాయికి చెందిన టి.తిరుమలరావు, గజపతి జిల్లా కొరసండ గ్రామానికి చెందిన రావుల లక్ష్మణరావులు టాటాఏస్‌తో పాటు ద్విచక్ర వాహనంలో గుట్కా, సారా తరలిస్తుండగా ఎస్‌ఐ కామేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది వారిని పట్టుకున్నారు.

రూ.5 లక్షల విలువచేసే గుట్కా పట్టివేత
పట్టుబడిన గుట్కా నిల్వలతో పోలీసులు
 టెక్కలి రూరల్‌: ఒడిశా నుంచి టెక్కలికి తరలిస్తున్న గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.5 లక్షలు ఉంటుంది. ఇందుకు సంబంధించి కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాలోని ఏడో మైలురాయికి చెందిన టి.తిరుమలరావు, గజపతి జిల్లా కొరసండ గ్రామానికి చెందిన రావుల లక్ష్మణరావులు టాటాఏస్‌తో పాటు ద్విచక్ర వాహనంలో గుట్కా, సారా తరలిస్తుండగా ఎస్‌ఐ కామేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 లక్షల విలువచేసే గుట్కాతో పాటు 50 లీటర్ల సారా పట్టుబడింది. వారిని విచారించగా టెక్కలి మండల శాసనం గ్రామానికి చెందిన టి.హరికి రూ.3 లక్షల విలువైన గుట్కా నిల్వలతో పాటు 50 లీటర్ల సారా అందించినట్టు చెప్పారు. దీంతో వెంటనే హరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ.5 లక్షల విలువచేసే గుట్కాతో పాటు 100 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నట్టు వివరించారు.  ఈ ఘటనపై ఎస్‌ఐ కామేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీతో పాటు టెక్కలి సీఐ ఆర్‌ నీలయ్య ఉన్నారు. 

Updated Date - 2021-10-25T05:46:38+05:30 IST