ఓపిక పట్టండి!

ABN , First Publish Date - 2021-07-13T05:10:15+05:30 IST

‘టీడీపీకి మంచి రోజులు వస్తాయి. కాస్త ఓపిక పట్టండి’ అంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. సోమవారం టెక్కలిలోని పార్టీ కార్యాలయంలో అచ్చెన్నను టెక్కలి, నందిగాం మండలాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు కలిశారు.

ఓపిక పట్టండి!
కార్యకర్తలతో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు
 మంచి రోజులు వస్తాయ్‌..

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

టెక్కలి, జూలై 12: ‘టీడీపీకి మంచి రోజులు వస్తాయి. కాస్త ఓపిక పట్టండి’ అంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. సోమవారం టెక్కలిలోని పార్టీ కార్యాలయంలో అచ్చెన్నను టెక్కలి, నందిగాం మండలాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు కలిశారు. టీడీపీ సాను భూతిపరులమనే ఉద్దేశంతో తమకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయడం లేదం టూ ఏకరువు పెట్టారు. ‘కొందరికి వాహనమిత్ర పథకం అందకుండా చేశారు. మరికొందరికి పింఛన్లు రద్దు చేశారు. రేషన్‌కార్డులు తొలగించారు. ఇంకొందరికి చేయూత పథకాన్ని దూరం చేశారు. అర్హులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయ డం లేదు’ అని వాపోయారు. దీనికితోడు తమపై కేసులు పెడుతున్నారు. గ్రామాల్లో భయపెడుతున్నారని  గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై అచ్చెన్న స్పం దిస్తూ.. ‘ఓపికపట్టండి.. మంచిరోజులు వస్తాయి’ అంటూ కార్యకర్తలకు  భరోసా నిచ్చారు. ‘ఈ ప్రభుత్వానికి కాలం చెల్లింది. ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరవు తోంది. ఇంతకంత బదులు తీర్చుకుందాం. అంతవరకూ వేచి ఉండండి’ అని కార్యకర్తలకు అచ్చెన్న దిశానిర్దేశం చేశారు. సమావేశంలో టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి మండలపార్టీల అధ్యక్షులు బగాది శేషగిరి, పినకాన అజయ్‌ కుమార్‌, జీరు భీమారావు, హనుమంతు రామకృష్ణ, మళ్ల బాలకృష్ణ, అట్టాడ ప్రసాద్‌ పాల్గొన్నారు. Updated Date - 2021-07-13T05:10:15+05:30 IST