దైవదర్శనానికి వెళ్లి వస్తూ...

ABN , First Publish Date - 2021-02-07T05:09:02+05:30 IST

దైవదర్శనానికి వెళ్లి ఇంటికి వస్తుండగా మార్గమ ధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు దుర్మరణం చెందాడు.

దైవదర్శనానికి వెళ్లి వస్తూ...
నుజ్జునుజ్జయిన కారు


 రోడ్డు ప్రమాదంలో బాలుడు దుర్మరణం 

మరో ఐదుగురికి గాయాలు ఫ బాధితులంతా ఒడిశావాసులు

రణస్థలం, ఫిబ్రవరి 6: దైవదర్శనానికి వెళ్లి ఇంటికి వస్తుండగా మార్గమ ధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు దుర్మరణం చెందాడు. మరో ఐదు గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే...ఒడిశా రాష్ట్రానికి చెందిన రెండు కుటుంబాలు సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకొనేందుకు శనివారం తెల్లవారుజామున కారులో వెళ్లారు. దర్శనం అనంతరం సాయంత్రం స్వగ్రామా నికి  బయలుదేరారు.  పైడిభీమవరం వద్ద జాతీయ రహదారిపై వీరి వాహనం ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో మూడేళ్ల బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. కన్నాసాహు, లక్ష్మీసాహు, విజయ్‌కుమార్‌సాహుతో పాటు మరో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. సంఘటనా స్థలానికి జేఆర్‌పురం ఎస్‌ఐ కంది వాసునారాయణ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  


 

Updated Date - 2021-02-07T05:09:02+05:30 IST