పైడిగాం ప్రాజెక్టు కాలువకు గండి

ABN , First Publish Date - 2021-10-08T05:26:40+05:30 IST

పైడిగాం ప్రాజెక్టు కాలువకు పొత్తంగి వద్ద గండిపడింది. ఇటీవల కురిసిన వర్షాలకు కాలువ గోడలకు చిన్నరంధ్రం ఏర్పడింది.

పైడిగాం ప్రాజెక్టు కాలువకు గండి
కాలువకు గండిపడిన దృశ్యం


హరిపురం:పైడిగాం ప్రాజెక్టు కాలువకు పొత్తంగి వద్ద గండిపడింది. ఇటీవల కురిసిన వర్షాలకు కాలువ గోడలకు చిన్నరంధ్రం ఏర్పడింది.ఇది కాస్తా పెరిగి గండిపడింది.  పొత్తంగి, బొరంట, కొర్రాయిపేట గ్రామాలకు చెందిన  వంద మంది రైతులు రోజంతా కష్టపడినా గండిపూడ్చలేక చేతులెత్తేశారు. కాలువకు గండిపడిన  విషయాన్ని ఉన్నతాధికారు లకు తెలియజేశామని నీటిపారుదలశాఖఏఈ శ్రీనివాసరావు ఆంధ్రజ్యోతికి తెలిపారు. ఫఆమదాలవలస రూరల్‌: మండలంలోని గాజులకొల్లివలస వద్ద 22ఎల్‌ కాలువకు  గులాబ్‌ తుఫాన్‌తో కురిసిన వర్షాలకు  గండిపడింది.  వారం రోజులు గడుస్తున్న అధికారులు గండి పూడ్చలేదని రైతులు వాపోతున్నారు. వరద నీటి ముంపులో ఇప్పటికి పంటపొలాలు ఉన్నాయని,అధికారులు స్పందించి గండి పూడ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.




 



Updated Date - 2021-10-08T05:26:40+05:30 IST