ఘనంగా ఆలయ వార్షికోత్సవాలు

ABN , First Publish Date - 2021-03-25T05:23:27+05:30 IST

జిల్లాలో పలు గ్రామాల్లోని ఆలయాల వార్షికోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకుల ఆధ్వర్యంలో విశేష పూజలు, హోమాలు, భజనలు, అన్న సంతర్పణ కార్యక్రమాలు చేపట్టారు.

ఘనంగా ఆలయ వార్షికోత్సవాలు
నందిగాం: సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలు

ఉమా అగస్త్యేశ్వర ఆలయంలో..

నందిగాం, మార్చి 24: నందిగాం ఉమా అగస్త్యేశ్వర స్వామి ఆలయ పునః ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠ, వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పురోహితులు రేజేటి బోసుబాబు, మేడేపల్లి రమేష్‌శర్మ వేదమంత్రాల మధ్య విశేష కార్యక్రమాలు చేపట్టారు. విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, సామూహిక కుంకు మార్చనలు చేశారు. శివపార్వతుల కల్యాణం అంగరంగ  వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వందలాదిమంది భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 


 ఉమా మహేశ్వర ఆలయంలో...

టెక్కలి: పట్టణంలోని శేరివీధి ఊరచెరువు గట్టుపై ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికో త్సవం బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సామూహిక మహారు ద్రాభిషేకం, రుద్రహోమం, తిరువీధి చేపట్టారు. మామిడి గణపతిశర్మ ఆధ్వర్యంలో ఉమారామలింగేశ్వరస్వామి కల్యాణం, అన్నదానం చేశారు. కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల భక్తులు పాల్గొన్నారు. 

 

లక్ష్మీ పేరంటాలమ్మ ఆలయంలో...

అబ్బాయిపేట (జలుమూరు): అబ్బాయిపేటలో వెలిసిన లక్ష్మీపేరంటాలమ్మకు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి పర్వదినంతో పాటు ఆలయ 16వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామస్థులు మంగళ వాయిద్యాలు, ముర్రాటలతో ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకుని పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు.   


లక్ష్మీ గణపతి ఆలయంలో...

 వంగర: అరసాడ లక్ష్మీగణపతి ఆలయ వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు.  ఆలయ ధర్మకర్తలు ధనలక్ష్మి, కృష్ణమూర్తి తదితరులు ప్రత్యేక పూజ లు చేశారు.  హోమాలు, విశేష పూజ, అన్న సమారాధన చేపట్టిరు. సా యంత్రం స్వామి చిత్రపటాన్ని ఊరేగించారు. కార్యక్రమంలో పలు గ్రామాల భక్తులు పాల్గొన్నారు. 


వైభవంగా ముఖలింగేశ్వరుని గ్రామోత్సవం

శ్రీముఖలింగం (జలుమూరు): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వర స్వామి వారి గ్రామోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు చేసి పల్లకిలో వేంచేపుచేసి గ్రామోత్సవం చేశారు. కార్యక్రమంలో  అర్చకులు పెద్దలింగన్న, నారాయణమూర్తి, శ్రీకృష్ణ, అప్పారావు, దేవదాయశాఖ సిబ్బంది, పలువురు భక్తులు పాల్గొన్నారు.

 


 

Updated Date - 2021-03-25T05:23:27+05:30 IST