అధికార లాంఛనాలతో పోలీసు జాగిలానికి అంత్యక్రియలు

ABN , First Publish Date - 2021-05-31T05:12:55+05:30 IST

అధికార లాంఛనాలతో పోలీసు జాగిలానికి అంత్యక్రియలు

అధికార లాంఛనాలతో పోలీసు జాగిలానికి అంత్యక్రియలు
మృతిచెందిన జాగిలం వద్ద నివాళి అర్పిస్తున్న సాయుధ సిబ్బంది

ఎచ్చెర్ల : జిల్లా పోలీసుశాఖలో సుదీర్ఘంగా సేవలందించి, అనారోగ్యంతో ఆదివారం మృతిచెందిన పోలీసు జాగిలాని (రాణి)కి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఎచ్చెర్ల సాయుధ పోలీసు మైదానంలో ఏఆర్‌ డీఎస్పీ ఎన్‌ఎస్‌ఎస్‌ శేఖర్‌, ఇతర పోలీసు అధికారులు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఆర్‌ డీఎస్పీ శేఖర్‌ మాట్లాడుతూ జిల్లా పోలీసు శాఖకు నేర పరిశోధన, బందోబస్తులో జాగిలం రాణి విశేషమైన సేవలందిం చిందన్నారు. 2009లో జన్మించిన ఈ జాగిలం లాబ్రాడర్‌ రీట్రైవర్‌ జాతికి చెందినదని, హైదరా బాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటిలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో ప్రత్యేకంగా శిక్షణ పొందిందన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ ప్రదీప్‌, ఆర్‌ఎస్‌ఐలు కోటేశ్వరరావు, వరప్రసాద్‌, మహమ్మద్‌ ఆలీ, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-31T05:12:55+05:30 IST