జెమ్స్‌లో ఉచితంగా గుండె వైద్యసేవలు

ABN , First Publish Date - 2021-05-31T05:14:19+05:30 IST

జెమ్స్‌లో ఉచితంగా గుండె వైద్యసేవలు

జెమ్స్‌లో ఉచితంగా గుండె వైద్యసేవలు

గుజరాతీపేట : రాగోలు జెమ్స్‌ ఆసుపత్రిలో ఆదివారం నుంచి వచ్చే నెల 30వ తేది వరకు గుండె సంబంధిత వ్యాధులకు ఉచితంగా వైద్యసేవలు అందించనున్నట్టు కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత గుండెవ్యాధులతో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయన్నారు. దీని నివా రణలో భాగంగా గుండెకు సంబంధించి అన్ని రకాల వైద్యసేవలు అందిస్తున్నట్టు చెప్పారు. రక్తపరీక్షలు, 2డి  ఈకో, ఈసీజీ, టీఎంటీ తదితర వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్‌ కోరారు. గుండెవ్యాధుల వైద్యనిపుణులు అరుణ్‌కుమార్‌, విజయ్‌, నాగచైతన్య, గుండె శస్త్రచికిత్స నిపుణులు రవికిరణ్‌, అరవింద్‌ అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాల కోసం 7680945332/47, 6309990628/29 ఫోన్‌ నెంబర్ల ద్వారా డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించాలని సూచించారు. 

 

Updated Date - 2021-05-31T05:14:19+05:30 IST