సైకిల్‌పై తిరుమలకు

ABN , First Publish Date - 2021-12-10T05:29:38+05:30 IST

సైకిల్‌పై తిరుమలకు

సైకిల్‌పై తిరుమలకు
సైకిళ్లపై తిరుమలకు వెళ్తున్న తండ్రీకుమారుడు

ఎచ్చెర్ల: అజ్జరాం గ్రామానికి చెందిన బోర ఈశ్వరరావు తన కుమారుడు ఏడుకొండలు గురువారం సైకిల్‌పై తిరుమల యాత్రకు బయలుదేరారు. 2000 సంవత్సరంలో ఒంటరిగా పాదయాత్ర చేసుకుంటూ ఈశ్వరరావు తిరుమలకు వెళ్లాడు. ఆ మరుసటి  ఏడాది నుంచి సైకిల్‌పై వెళ్లి వెంకన్నను దర్శనం చేసుకుంటున్నాడు. ఈ ఏడాది మాత్రం తన కుమారుడితో కలిసి సైకిల్‌పై తిరుమలకు బయలుదేరాడు. 21వ సారి తాను తిరుమలకు వెళ్తున్నట్లు ఆయన   చెప్పాడు. లోక కళ్యాణం కోసం ఈ యాత్రను కొనసాగిస్తున్నట్టు తెలిపాడు. పది రోజుల్లో తిరుమలను చేరుకుంటామని చెప్పారు. 

Updated Date - 2021-12-10T05:29:38+05:30 IST