సమయపాలన పాటించండి

ABN , First Publish Date - 2021-10-31T05:38:45+05:30 IST

సచివాలయ సిబ్బంది సమయ పాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని జేసీ కె.శ్రీనివాసులు ఆదేశించారు. కళవలస, కిడిమి గ్రామ సచివాలయాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సమయపాలన పాటించండి
సచివాలయ సిబ్బంది పనితీరును ఆన్‌లైన్‌లో పరిశీలిస్తున్న జేసీ శ్రీనివాసులు

 జేసీ శ్రీనివాసులు

సారవకోట (జలుమూరు), అక్టోబరు 30: సచివాలయ సిబ్బంది సమయ పాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని జేసీ కె.శ్రీనివాసులు ఆదేశించారు. కళవలస, కిడిమి గ్రామ సచివాలయాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయాల వద్ద  సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలు ఇంగ్లీష్‌లో ఉండడంపై అసహనం వ్యక్తంచేస్తూ తక్ష ణం తెలుగులో జాబితాలు తయారు చేసి ప్రదర్శించాలన్నారు. అలాగే అనర్హుల జాబితాను, ఏ కారణంతో అనర్హత పొందారో ఆ వివరాలను ప్రకటించాలని సూచించారు. ప్రజలకు సేవలందించడంలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిరోజు విధులకు హాజరైనపుడు బయోమెట్రిక్‌ వేయాలన్నారు. గ్రామ వలంటీర్ల పనితీరుపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంపీడీవో బీవీఆర్‌ ప్రసాదరావు పాల్గొన్నారు. 


సేవలను విస్తృతం చేయండి 

నందిగాం: సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను విస్తృత పరచాలని  టెక్కలి సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌ అన్నారు. శనివారం కొత్తగ్రహారం, పెద్దబాణాపురం సచివాలయాలను సందర్శించారు. ప్రతి ఒక్క ఉద్యోగి బయోమెట్రిక్‌ హాజరు వేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఉప తహసీల్దార్‌ వి.లక్ష్మీనారాయణ ఉన్నారు. నర్సిపురంలో తహసీల్దార్‌ ఎన్‌.రాజారావు ఆధ్వ ర్యంలో సివిల్‌ రైట్స్‌డే నిర్వహించి పలు సమస్యలపై చర్చించారు. మండల సర్వేయర్‌ కె.జోగారావు తదితరులు పాల్గొన్నారు. 

  

Updated Date - 2021-10-31T05:38:45+05:30 IST