చిట్టిగెడ్డకు గండి

ABN , First Publish Date - 2021-09-03T05:41:46+05:30 IST

చిట్టిగెడ్డ కాలువకు గండి పడింది. దీంతో పది ఎకరాల వరి పంట నీట మునిగింది. సాయన్న ఛానెల్‌ బ్రాంచ్‌ పరిధిలోని చిట్టిగెడ్డ ఇటీవల వర్షాలకు ఉధృతంగా ప్రవహిం చింది. నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కాలువలో ఎక్కడికక్కడే పూడిక, గుర్రపుడెక్క పే

చిట్టిగెడ్డకు గండి
గండిపడిన దృశ్యంరేగిడి: చిట్టిగెడ్డ కాలువకు గండి పడింది. దీంతో పది ఎకరాల వరి పంట నీట మునిగింది. సాయన్న ఛానెల్‌ బ్రాంచ్‌ పరిధిలోని చిట్టిగెడ్డ ఇటీవల వర్షాలకు ఉధృతంగా ప్రవహిం చింది. నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కాలువలో ఎక్కడికక్కడే పూడిక, గుర్రపుడెక్క పేరుకుపోయింది. దీంతో నీటి ప్రవాహం సరిగ్గా జరగక సంకిలి సమీపంలో కాలువకు గండి పడింది. సంకిలి, బొడ్డవలస ఆయకట్టు పరిధిలోని వరి పొలా లు నీట మునిగాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గండిని పూడ్చాలని ఆయకట్టు రైతులు మజ్జి సాంబమూర్తి,నారు జనార్దనరావు విజ్ఞప్తి చేశారు. Updated Date - 2021-09-03T05:41:46+05:30 IST