మడ్డువలసకు పోటెత్తిన వరద
ABN , First Publish Date - 2021-09-03T05:40:26+05:30 IST
మడ్డువలస రిజర్వాయర్‌లోకి గణనీయంగా ఇన్‌ఫ్లో పెరిగింది. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి గురువారం ఒక్కసారిగా వరద నీరు పోటెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు గేట్లను 60 సెంటీమీటర్ల మేర ఎత్తి...4,662 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు.

వంగర: మడ్డువలస రిజర్వాయర్‌లోకి గణనీయంగా ఇన్‌ఫ్లో పెరిగింది. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి గురువారం ఒక్కసారిగా వరద నీరు పోటెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు గేట్లను 60 సెంటీమీటర్ల మేర ఎత్తి...4,662 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. ఇప్పటికే రెండు సెంటీమీటర్ల మేర గేట్లు ఎత్తడంతో కాలువల్లో పుష్కలంగా నీరు ప్రవహిస్తోంది. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఎత్తడంతో శివారు ఆయకట్టుకు సైతం నీరు చేరింది. మెట్ట ప్రాంతాల్లో సైతం ఉభాలు ప్రారంభమ య్యాయి. ఖరీఫ్ కష్టాల నుంచి గట్టెక్కినట్టేనని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.