జ్వరాల సర్వే వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-05-21T05:24:27+05:30 IST
జ్వరాల సర్వే వేగంగా చేయాలని ఎంపీడీవో బి.వెంకటర మణ తెలిపారు. గురువారం మండలంలోని అరకపద్ర సచివాలయం వద్ద ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, వలంటీర్లతో సమావేశం నిర్వహించారు.

ఇచ్ఛాపురం రూరల్: జ్వరాల సర్వే వేగంగా చేయాలని ఎంపీడీవో బి.వెంకటర మణ తెలిపారు. గురువారం మండలంలోని అరకపద్ర సచివాలయం వద్ద ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఇచ్ఛాపురం: ముని సిపాలిటీలో జరుగుతున్న జ్వరాల సర్వేను కమిషనర్ లాలం రామలక్ష్మి గురువారం పరిశీలించారు. ఈ సంద ర్భంగా సిబ్బందికి సూచనలుచేశారు. పొందూరు: మనో ధైర్యమే కొవిడ్‌కు ఔషధమని ఆంధ్రప్రదేశ్ సాధుపరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసా నంద తెలిపారు. గురువారం బాణాంలో చెరువులో ఉపాధి పనులు చేస్తున్న ఉపాధి కూలీలతో మాట్లాడారు. గార: కరోనా వైరస్ నివారణలో భాగంగా సంబంధిత సిబ్బంది ఫీవర్ సర్వేను పక్కాగా నిర్వహించాలని, ఏ రోజు సమాచారాన్ని ఆ రోజు అందజేయాలని మండల ప్రత్యేక అధికారి గుత్తు రాజారావు ఆదేశించారు. గురువారం ఆయన బందరవానిపేట, కె.మత్స్యలేశం, కళింగపట్నం గ్రామ సచివాలయాలను సందర్శించి, సిబ్బందితో సమీక్షించారు. ప్రజలు బయట తిరగకుండా, భౌతికదూరం పాటించేలా, మాస్కులు ధరించేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు బి.లలిత, టి.మౌనికరాణి, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
అనవసరంగా బయటకు రావొద్దు
ఇచ్ఛాపురం: అత్యవసర పరిస్థితుల్లో మినహా అనవసరంగా బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేయాలని సిబ్బందికి సీఐ ఎం.వినోద్‌బాబు సూచించారు. గురువారం ఇచ్ఛాపురంలో పలు కూడళ్లలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ ను పరిశీలించారు. ఆయనతోపాటు ఎస్‌ఐ సత్యనారాయణ ఉన్నారు.
కొవిడ్ కమిటీలు సక్రమంగా పని చేయాలి
ఎచ్చెర్ల: కొవిడ్ కట్టడికి గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలు సక్రమం గా పని చేయాలని తహసీల్దార్ సనపల సుధాసాగర్ తెలిపారు. సర్పంచ్, వార్డు స భ్యులు, ఏఎన్‌ఎం, ఆశవర్కర్లు, మహిళా పోలీసు, పంచాయతీ కార్యదర్శి ఈ కమిటీలో ఉన్నట్లు చెప్పారు. కరోనాపై ప్రజలకు అవగాహన, కరపత్రాల పంపిణీ, ప్రధాన కూడళ్లలో పోస్టర్లు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి, నో మాస్క్- నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఈ కమిటీ ప్రధాన పాత్ర వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కమిటీలతో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఎచ్చెర్లలో 67 కేసులు
మండలంలో గురువారం 67 మందికి కరోనా పాజిటివ్‌గా గుర్తించి నట్టు తహసీ ల్దార్ సనపల సుధాసాగర్ తెలిపారు. కొవిడ్ కేర్ సెంటర్‌కు 8 మందిని తరలించా మని, హోం ఐసోలేషన్‌లో ఉన్న 114 మందికి మెడికల్ కిట్లు అందజేశామని చెప్పారు. ఫీవర్ సర్వేలో 47 మందికి కొవిడ్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. మూడు కంటైన్మెంట్ జోన్లు కొనసాగుతున్నాయని, 10 మందికి వ్యాక్సిన్ వేశామని తెలిపారు.