ఎస్‌బీ జమేదార్‌కు ఘనంగా వీడుకోలు

ABN , First Publish Date - 2021-08-25T06:31:39+05:30 IST

స్థానిక పోలీ్‌సస్టేషనకు చెందిన స్పెషల్‌బ్రాంచ జమేదార్‌గా పనిచేస్తున్న తిరుపాల్‌నాయక్‌ను మంగళవారం ఘనంగా వీడుకోలు పలికారు.

ఎస్‌బీ జమేదార్‌కు ఘనంగా వీడుకోలు

గోరంట్ల, ఆగస్టు 24: స్థానిక పోలీ్‌సస్టేషనకు చెందిన స్పెషల్‌బ్రాంచ జమేదార్‌గా పనిచేస్తున్న తిరుపాల్‌నాయక్‌ను మంగళవారం ఘనంగా వీడుకోలు పలికారు. గోరంట్ల నుండి పెనుకొండ స్టేషనకు బదిలీ అయిన సందర్భంగా వీడుకోలు సమావేశం ఏర్పాటు చేశారు. సీఐ జయనాయక్‌ ఆధ్వర్యంలో తిరుపాల్‌నాయక్‌ను పోలీస్‌ సిబ్బంది శాలువ, పూలమాలలతో సత్కరించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తిరుపాల్‌నాయక్‌ మెరుగైన పనితీరు కనబరిచారని సీఐ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్‌లు బాబు, రెడ్డి ప్రభావతి, కానిస్టేబుల్‌లు రమే్‌షనాయక్‌, గోవర్దన, పాల్గొన్నారు. 

సీఐకు సన్మానం: సీఐ జయనాయక్‌ను పుట్టగుండ్లపల్లి పంచాయతీ సర్పంచ నర్సిరెడ్డి, వైసీపీ నాయకులతో కలిసి మంగళవారం ఘనంగా సన్మానించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోరంట్ల సీఐ జయనాయక్‌కు ఉత్తమ సేవా అవార్డు లభించింది. ఈ సందర్భంగా పోలీ్‌సస్టేషనకు వెళ్లి సీఐను అభినందిస్తూ శాలువ పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి, రంగారెడ్డి, ఆనంద్‌, ఆదినారాయణరెడ్డి, అశోక్‌రెడ్డి, హేమసుందర్‌, గంగాద్రి, కృష్ణానాయక్‌, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-25T06:31:39+05:30 IST