సవాళ్లతో కూడిన ప్రపంచాన్ని ఎదుర్కోవాలి

ABN , First Publish Date - 2021-11-01T05:11:29+05:30 IST

సవాళ్లతో కూడిన ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు విద్యార్థులు సిద్ధం కావాలని కాగ్నిజెంట్‌ సంస్థ సీని యర్‌ డైరెక్టర్‌ జులెన్‌. సి. మొహంతి అన్నారు. ఇందుకోసం ఎడాప్ట్‌ విధానాన్ని అనుసరించాలని సూచించారు. జీఎంఆర్‌ఐటీలో ఆదివారం అటానమస్‌ ఆరో స్నాతకోత్సవాన్ని నిర్వహించారు.

సవాళ్లతో కూడిన ప్రపంచాన్ని ఎదుర్కోవాలి
డిగ్రీతో పాటు బంగారు పతకం అందజేస్తున్న మొహంతి

కాగ్నిజెంట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ జులెన్‌ సి మొహంతి

రాజాం రూరల్‌, అక్టోబరు 31: సవాళ్లతో కూడిన ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు విద్యార్థులు సిద్ధం కావాలని  కాగ్నిజెంట్‌ సంస్థ సీని యర్‌ డైరెక్టర్‌ జులెన్‌. సి. మొహంతి అన్నారు. ఇందుకోసం ఎడాప్ట్‌ విధానాన్ని అనుసరించాలని సూచించారు. జీఎంఆర్‌ఐటీలో ఆదివారం అటానమస్‌ ఆరో స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తయారుకావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గవ ర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ డా.జె.గిరిష్‌ మాట్లాడుతూ.. ఉన్నత ఆశయ సాధ నే లక్ష్యంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. అనంతరం విద్యార్థులకు పట్టాలతోపాటు బంగారు, వెండి పతకాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డా.ప్రసాద్‌, జీఎంఆర్‌వీఎఫ్‌ సీవోవో ఎల్‌ఎం లక్ష్మణమూర్తి, సీఈవో పీకేఎస్‌వీ సాగర్‌తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-11-01T05:11:29+05:30 IST