ఉత్సాహంగా 5కే రన్‌ పోటీ

ABN , First Publish Date - 2021-01-14T05:18:28+05:30 IST

మండలంలోని రంగోయిలో ఉద్దానం విద్యాభి వృద్ధి వేదిక ఆధ్వర్యంలో భోగి పురస్కరించుకొని బుధవారం 5కె రన్‌ పోటీ ఉత్సాహంగా సాగింది.

ఉత్సాహంగా 5కే రన్‌ పోటీ
విజేతలకు బహుమతులను అందజేస్తున్న నిర్వాహకులు

పలాస రూరల్‌: మండలంలోని రంగోయిలో ఉద్దానం విద్యాభి వృద్ధి వేదిక ఆధ్వర్యంలో భోగి  పురస్కరించుకొని బుధవారం 5కె రన్‌ పోటీ ఉత్సాహంగా సాగింది. పురుషుల విభాగంలో రాంబుడ్డి మహే ష్‌, ప్రభాకర్‌, బీడీ మూర్తి, ధనరాజు, మహిళల విభాగంలో యా మిని, ఎ.విజయ, కె.ఇందు, పి.ధనలక్ష్మి మొదటి నాలుగు బహుమతులను సా ధించారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఎన్‌. రమేష్‌, గ్రీన్‌ఆర్మీ అధ్యక్షుడు బి.గోపాల్‌, బి.ఓంకార్‌ పాల్గొన్నారు. 

క్రికెట్‌ విజేత బేతాళపురం

హరిపురం: మందస మండలం  బేతాళపురంలో డివిజన్‌ స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌లో  బేతాళపురం గోల్కొండ హైస్కూల్‌ జట్టు విజేతగా, రట్టి బుల్స్‌ జట్టు రన్నర్‌గా నిలిచాయి. 54 జట్లు పాల్గొనగా, విజేత లకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొర్ల కన్నారావు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్నేహభావంతో క్రీడలు కొనసాగాలని కోరారు. కార్యక్రమంలో కారి ఈశ్వరరావు, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-14T05:18:28+05:30 IST