ఉత్సాహంగా..

ABN , First Publish Date - 2021-12-20T04:41:50+05:30 IST

ఎచ్చెర్ల సాయుధ పోలీసు మైదానంలో రెవెన్యూ, పోలీసు జట్ల మధ్య ఆదివారం క్రికెట్‌ టోర్నమెంట్‌ ఉత్సాహంగా సాగింది. ఈ పోటీలను కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌, ఎస్పీ అమిత్‌బర్దర్‌లు ప్రారంభించారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీనివాసకుమార్‌ టాస్‌ వేశారు.

ఉత్సాహంగా..
విజేతగా నిలిచిన పోలీసు జట్టుతో ఎస్పీ అమిత్‌బర్దర్‌

- రెవెన్యూ, పోలీసు జట్ల క్రికెట్‌ టోర్నమెంట్‌

ఎచ్చెర్ల, డిసెంబరు 19: ఎచ్చెర్ల సాయుధ పోలీసు మైదానంలో రెవెన్యూ, పోలీసు జట్ల మధ్య ఆదివారం క్రికెట్‌ టోర్నమెంట్‌ ఉత్సాహంగా సాగింది. ఈ పోటీలను కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌, ఎస్పీ అమిత్‌బర్దర్‌లు ప్రారంభించారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీనివాసకుమార్‌ టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన పోలీసు జట్టు కెప్టెన్‌ అమిత్‌బర్దర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నారు. పోలీసు జట్టు సభ్యులు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి, 129 పరుగులు చేశారు. బౌలింగ్‌ చేసిన కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ 4 ఓవర్లలో 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రెవెన్యూ జట్టు 18.5 ఓవర్లలో 122 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. విజేతగా పోలీసు జట్టు నిలిచింది. ఈ సందర్భంగా కలెక్టర్‌, ఎస్పీలు మాట్లాడుతూ స్నేహపూర్వక వాతావరణంలో క్రీడలు ఆడడం వల్ల శారీరక, మానసిక ఉల్లాసంతో పాటు.. శాఖల మధ్య మరింత సమన్వయం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్‌ కె.శ్రీనివాసులు, ఏఎస్పీలు పి.సోమశేఖర్‌, కె.శ్రీనివాసరావు, డీఎస్పీలు ఎం.మహేంద్ర, ఎన్‌ఎస్‌ శేఖర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-20T04:41:50+05:30 IST