సచివాలయ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2021-01-14T05:13:15+05:30 IST

వార్డు, గ్రామ సచివాలయ ఎంప్లాయీస్‌ జిల్లా ఫెడరేషన్‌ బుధవారం ఏర్పాటైంది. స్థానిక ఏపీఎన్జీవో హోమ్‌లో ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ జానీపాషా సమక్షంలో జిల్లా కమిటీని ఎనుకున్నారు.

సచివాలయ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఏర్పాటు


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జనవరి 13 : వార్డు, గ్రామ సచివాలయ ఎంప్లాయీస్‌ జిల్లా ఫెడరేషన్‌ బుధవారం ఏర్పాటైంది. స్థానిక ఏపీఎన్జీవో హోమ్‌లో ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ జానీపాషా సమక్షంలో జిల్లా కమిటీని ఎనుకున్నారు.    జిల్లా అధ్యక్షుడిగా షబ్బీర్‌కుమార్‌, ఉపాధ్యక్షులుగా హళిని, గిరిరాజు, ప్రధాన కార్యదర్శిగా నారాయణరావు, సహాయకార్యదర్శులుగా జగదీష్‌, ఢిల్లీశ్వరరావు, షణ్ముఖరావు, కార్యనిర్వాహక సభ్యులుగా శశికాంత్‌, నాయుడు, ఆర్‌ కల్యాణిల నియమితులయ్యారు. కార్యక్రమంలో ఏపీఎన్జీవో రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు, జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-14T05:13:15+05:30 IST