ఎనిమిది ప్రాథమిక పాఠశాలలు విలీనం

ABN , First Publish Date - 2021-10-15T05:01:40+05:30 IST

మండలంలోని 250 మీటర్ల దూరంలోగల ఎనిమిది ప్రాథమిక పాఠశాలలను సమీపంలోగల ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసినట్లు ఎంఈవో బి.మాధవరావు తెలిపారు.

ఎనిమిది ప్రాథమిక పాఠశాలలు విలీనంజలుమూరు: మండలంలోని 250 మీటర్ల దూరంలోగల ఎనిమిది ప్రాథమిక పాఠశాలలను సమీపంలోగల  ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసినట్లు ఎంఈవో బి.మాధవరావు తెలిపారు.వీటిపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరారు. పాఠశాల విద్యా కమిషనర్‌ పంపించిన జాబితా మేరకు పెద్దదూగాం, లింగాలవలస, యలమంచిలి, పాగోడు,చల్లవానిపేట, లింగాలపాడు, శ్రీముఖలింగం(ప్రత్యేక) ప్రాథమిక పాఠశాలలను సమీప ఉన్నతపాఠశాలల్లో విలీనం చేసినట్లు చెప్పారు. అయితే కరవంజ ఉన్నత పాఠశాలలో దగ్గరలో ఉన్న కరవంజ ప్రాథమిక పాఠశాలను విలీనం చేయకుండా, వెలుసోద పాఠశాలను విలీనం చేయడంపై గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారని తెలిపారు. ఆయా పాఠ శాలల్లో మూడో తరగతి నుంచి విద్యార్థులను మాత్రమే ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నట్టు ఎంఈవో తెలిపారు.

Updated Date - 2021-10-15T05:01:40+05:30 IST