రైల్వేస్టేషన్లలో సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2021-11-10T04:53:31+05:30 IST

: జిల్లాలో 40 రైల్వే స్టేషన్లలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

రైల్వేస్టేషన్లలో సమస్యల పరిష్కారానికి కృషి
జాడుపూడి రైల్వేస్టేషన్‌ను పరిశీలిస్తున్న రామ్మోహన్‌నాయుడు

 ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు 

కవిటి, నవంబరు 9 : జిల్లాలో 40 రైల్వే స్టేషన్లలో  సమస్యల  పరిష్కారానికి  కృషి చేస్తానని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. మంగళవారం   మండలంలోని జాడుపూడి రైల్వేస్టేషన్‌ను పరిశీలించి, స్టేషన్‌ మాస్టర్‌కు వినతిపత్రం   అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జాడుపూడి రైల్వేస్టేషన్‌లో రెండో ప్లాట్‌ఫారం నుంచి చివరి వరకు బ్రిడ్జి నిర్మించేందుకు రైల్వే అధికారులతో మాట్లాడు తానని తెలిపారు. ఇక్కడ ప్రయాణికుల కోసం  పాసింజర్‌, డీఎంయూ రైళ్లు హాల్టింగ్‌ ఇచ్చేలా కృషిచేస్తానని చెప్పారు. కార్యక్రమంలో మణిచంద్రప్రకాష్‌, బాసుదేవ్‌రౌళో, సంతోష్‌పట్నాయక్‌,  కృష్ణారావు, సదానందరౌళో పాల్గొన్నారు. 

 


Updated Date - 2021-11-10T04:53:31+05:30 IST