టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-01-14T05:16:09+05:30 IST

పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయ కులు కృషి చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ కోరారు.

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి


పాలకొండ (వీరఘట్టం): పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయ కులు కృషి చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ కోరారు. బుధవారం వీరఘట్టం మండలంలోని చిది మిలో నవయుగ బౌరోతు యువజన సంఘం ఆధ్వర్యంలో  టీడీపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేకత విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు పనిచే యాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో ఖండాపు వెంకట రమణ, జామి లక్ష్మీనారాయణ, ఉదయాన హరి పాల్గొన్నారు.


టీడీపీ పట్టణ కార్యవర్గం ఎన్నిక  

సోంపేట: సోంపేట పట్టణ టీడీపీ కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బీన ఆనందరావు, ఉపాధ్యక్షుడిగా బెల్లాన శ్రీకాంత్‌, ప్రధానకార్యదర్శిగా రెల్ల శ్రీనివాసరావు, కార్యదర్శులుగా దున్న సుజాత, దున్న వాసవి, కొత్తపల్లి నాగరాజు, బెండి సుజాత, కర్రి గోవిందరెడ్డిను ఎన్నుకున్నారు.  కార్యవర్గాన్ని మాజీ ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు సూరాడ చంద్రమోహన్‌, నాయకులు చిత్రాడ శేఖర్‌ అభినందించారు.


Updated Date - 2021-01-14T05:16:09+05:30 IST