ప్రభుత్వాల తీరుతో విద్యారంగం నిర్వీర్యం

ABN , First Publish Date - 2021-12-20T04:53:54+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న నూతన విద్యా విధానం-2020తో విద్యారంగం నిర్వీర్యం అవుతోందని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. యూటీఎఫ్‌ జిల్లా విద్యా, వైజ్ఞానిక మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విధానాన్ని తిప్పికొట్టాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వాల తీరుతో విద్యారంగం నిర్వీర్యం
మహాసభలో మాట్లాడుతున్న యూటీఎఫ్‌ రాష్ట్ర నేత

యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు

కొత్తూరు, డిసెంబరు 19: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న నూతన విద్యా విధానం-2020తో విద్యారంగం నిర్వీర్యం అవుతోందని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. యూటీఎఫ్‌ జిల్లా విద్యా, వైజ్ఞానిక మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విధానాన్ని తిప్పికొట్టాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సామాజికవేత్త మామిడి గోవిందరావు మాట్లాడుతూ.. ఉపా ధ్యాయ సంక్షేమం కోసం యూటీఎఫ్‌ నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పొందూరు అప్పారావు సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పడాల భూదేవి, యూటీఎఫ్‌ జిల్లా ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-12-20T04:53:54+05:30 IST