ప్రమాదాలకు నిలయంగా దూసి రోడ్డు
ABN , First Publish Date - 2021-08-26T05:09:12+05:30 IST
దూసి రోడ్డు ప్రమాదాలకు నిల యంగా మారింది. ముఖ్యంగా రాగోలు నుంచి దూసి వెళ్లే మార్గంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.

రహదారిపై కూలిన చెట్లు
తొలగించని ఆర్‌అండ్‌బీ అధికారులు
జంగిల్ క్లియరెన్స్ చేపట్టని వైనం
ఆమదాలవలస: దూసి రోడ్డు ప్రమాదాలకు నిల యంగా మారింది. ముఖ్యంగా రాగోలు నుంచి దూసి వెళ్లే మార్గంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు వారాల కిందట వీచిన భారీ గాలులకు దూసి కాలువ సమీపంలో మామిడి, పాసి చెట్లు రోడ్డుకు అడ్డంగా కూలిపోవ డంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ఆటో డ్రైవర్లు.. వాహనాలు రాకపోకలు సాధించేందకు వీలుగా చెట్ల కొమ్మలను కొంతమేర తొలగించారు. అయితే, ఈ చెట్లను పూర్తిస్థాయిలో తొలగించాల్సిన ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో చీకటిపడిన తర్వాత ఈ మార్గంలో వచ్చే వారికి రహదారిపై పడిఉన్న చెట్ల కొమ్మలు కనిపించపోవడంతో ప్రమాదాలు చోటు చేసు కుంటున్నాయి. ఇటీవల ద్విచక్ర వాహనంపై పెళ్లికి వెళ్తున్న వారు ప్రమాదానికి గురై తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరారు. మరోపక్క ఈ మార్గంలో జంగిల్ క్లియ రెన్స్ చేపట్ట లేదు. రోడ్డుకిరువైపులా చెట్లు, పిచ్చిమొక్కలు, ముళ్లకప్పలు ఏపుగా పెరగ డంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. ఇప్పటికైనా అధికారులు చర్య లు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బీ డీఈ జాన్‌విక్లిస్ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. రహదారిపై పడిపోయిన చెట్లను వాహనాల రాకపోకలు సాగించేందుకు వీలుగా తమ సిబ్బంది తొలగించారన్నారు. వాటిని వేలం వేయాల్సి ఉందన్నారు. జంగిల్ క్లియరెన్స్ చేయడానికి టెండర్లు పూర్తిచేసినట్లు తెలిపారు.