ట్రాఫిక్‌ కారణంతోనే.. కారును తొలగించాం

ABN , First Publish Date - 2021-07-24T05:58:51+05:30 IST

ట్రాఫిక్‌ కారణంతోనే.. కారును తొలగించాం

ట్రాఫిక్‌  కారణంతోనే.. కారును తొలగించాం
మాట్లాడుతున్న సర్పంచ్‌ ప్రభావతి, తదితరులు

సోంపేట : ట్రాఫిక్‌ కారణంగానే బజారువీధిలో ఓ చోటా నాయకుడు పార్కింగ్‌ చేసిన కారును తొలగించినట్టు సోంపేట మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ నగిరి ప్రభా వతి తెలిపారు. ఈ మేరకు ఆమె శుక్రవారం విలేఖరులతో మాట్లాడారు. దశాబ్ద కాలంగా సోంపేట రోడ్డు విస్తరణకు నోచుకోకపోవడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలె త్తుతున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకే బజారువీధిలో అడ్డంగా ఉన్న కారును తొలగించామన్నారు. పది రోజులుగా తొలగించాలని సంబంధిత వ్యక్తికి పంచాయతీ అధికారులు చెప్పినా పట్టించుకోలేదని, దీంతో అధికారులే తొలగించాల్సి వచ్చిందన్నారు. ఇంత చిన్న విషయంపై ఎమ్మెల్యే వచ్చి రాద్ధాంతం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. గతంలో టీడీపీ హయాంలో చేపట్టిన మెయిన్‌రోడ్డు విస్తరణ నిరుపేదలు ఉన్న చోట 40 అడుగులు, చోటానాయకులు ఉన్న ప్రాంతంలో 24 అడుగులు మాత్రమే విస్తరణ చేపట్టారని, అప్పుడు ఎమ్మెల్యే ఎక్కడకి వెళ్లారని ప్రశ్నించారు. సమావేశంలో ఉప సర్పంచ్‌ మల్లా వెంకటరమణ, మాజీ జడ్పీటీసీ నిమ్మన దాసు, వార్డు మెంబర్లు పి.గిరి, మల్లా యుగంధర్‌ పాల్గొన్నారు.   

 

Updated Date - 2021-07-24T05:58:51+05:30 IST