కాలువలను మట్టితో కప్పేశారు..!

ABN , First Publish Date - 2021-11-02T05:35:12+05:30 IST

మా గ్రామంలోని ముద్దాడ వీధిలో మురుగునీటి కాలువ లను గ్రావెల్‌ మట్టితో కప్పివేశారని చాకిపల్లి కొత్తూరుకు చెందిన జోగారావుతో పాటు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. సోమవారం సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌ స్పందన కార్యక్రమం నిర్వహించి వినతులు స్వీకరించారు.

కాలువలను మట్టితో కప్పేశారు..!
వినతులు స్వీకరిస్తున్న సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌

‘స్పందన’లో  చాకిపల్లి కొత్తూరు వాసుల వినతి

టెక్కలి: మా గ్రామంలోని ముద్దాడ వీధిలో మురుగునీటి కాలువ లను గ్రావెల్‌ మట్టితో కప్పివేశారని చాకిపల్లి కొత్తూరుకు చెందిన జోగారావుతో పాటు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. సోమవారం సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌ స్పందన కార్యక్రమం నిర్వహించి వినతులు స్వీకరించారు. మురుగునీరు ప్రవహించే కాలువల్లో మట్టి వేయడంతో ఇబ్బం దులు ఎదురవుతున్నాయని, తక్షణం తగు చర్యలు తీసుకోవాలని వారు వినతిపత్రం అందించారు. స్పందన కార్యక్రమానికి 25 వినతులు వచ్చా యి. వాటిలో కొన్ని.. నందిగాం మండలం నర్సిపురంలో ఇందిరాకాలనీ గృహాల నిర్మాణాలు చేపట్టగా ఖాళీ స్థలాన్ని కొందరు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని, తగు చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు యడ్ల గోపి వినతిపత్రం అందించారు. పలాస వేంకటేశ్వర కాలనీలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురౌతోం దని దానిని పరిరక్షించాలని బీజేపీ ప్రతినిధి ధర్మారావు కోరారు. జిల్లా లోని వడ్డెర కుల ధ్రువీకరణ పత్రాలు బీసీ-ఎ కింద జారీ చేయాలని జిల్లా వడ్డెర కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముడిదాన ఆనంద్‌ కుమార్‌ వినతిపత్రంలో కోరారు.

 

Updated Date - 2021-11-02T05:35:12+05:30 IST