రైతులను ఇబ్బంది పెట్టొద్దు : జేసీ

ABN , First Publish Date - 2021-12-31T05:49:18+05:30 IST

రైతులను ఇబ్బంది పెట్టొద్దు : జేసీ

రైతులను ఇబ్బంది పెట్టొద్దు : జేసీ
కోటబొమ్మాళి : సూచనలిస్తున్న జేసీ విజయసునీత

కోటబొమ్మాళి/టెక్కలి : ధాన్యం కొనుగోలులో రైతులను రైస్‌ మిల్లర్లు ఇబ్బంది పెట్టకుండా చూడాలని తహ సీల్దార్‌ ఆర్‌.మధును జేసీ విజయసునీత ఆదేశించారు. ఈ మేరకు గురువారం జీయన్నపేట రైతుభరోసా కేంద్రాన్ని ఆమె పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు బాడాన మురళి, టెక్కలి వ్యవసాయశాఖ ఏడీ బీవీ తిరుమలరావు, ఏవో ఎస్‌.గోవిందరావు పాల్గొన్నారు. అలాగే టెక్కలి మండలం లింగాలవలస పంచాయతీ సతివాడ గ్రామం వద్ద దేవీనారాయణ ఎక్స్‌పోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేయనున్న కలర్‌ గ్రానైట్‌ పరిశ్రమపై జేసీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్‌ శంకర్‌ నాయక్‌, గనులు శాఖ ఏడీ పురుషోత్తమనాయుడు పాల్గొన్నారు.

- టెక్కలి రూరల్‌ : ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు అన్నారు. గురువారం ధర్మ నీలాపురంలో రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలు సుకున్నారు. 

- రేగిడి : ధాన్యం కొనుగోళ్లుతో రైతుల్లో ఉన్న అభద్రత భావం తొలగించాలని తహశీలార్‌ బి.సత్యం, ఏవో మురళీకృష్ణ సూచించారు. గురువారం తన కార్యా లయంలో ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన శిక్షణలో ఆయన పాల్గొని మాట్లాడారు.

- పాలకొండ : ప్రతి ధాన్యం గింజా ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీపీఎం మండల కమిటీ కన్వీనర్‌ దావాల రమణారావు డిమాండ్‌ చేశారు. పాలకొండలో విలేకరులతో మాట్లాడుతూ రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Updated Date - 2021-12-31T05:49:18+05:30 IST