జాతీయోద్యమ నేతల విగ్రహాల ఆవిష్కరణ
ABN , First Publish Date - 2021-12-27T05:00:08+05:30 IST
స్థానిక ఆదివాసీ భవన ప్రాంగణంలో ఆదివాసీ సంఘ నేతల ఆధ్వర్యంలో జాతీయోద్యమకారులు కొమరం భీమ్, బిర్సాముండా, భగత్‌సింగ్ విగ్రహాలను ఆదివారం ఆవిష్కరించారు.

పాతపట్నం: స్థానిక ఆదివాసీ భవన ప్రాంగణంలో ఆదివాసీ సంఘ నేతల ఆధ్వర్యంలో జాతీయోద్యమకారులు కొమరం భీమ్, బిర్సాముండా, భగత్‌సింగ్ విగ్రహాలను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయనగరానికి చెందిన ఆదివాసీ రచయిత మల్లిపురం జగదీష్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యోద్యమంతో పాటు ఆదివాసీ ఉద్యమాల్లో వీరు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దొర సావిత్రమ్మ, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి వాబ యోగి, గురాడి అప్పన్న, ఏయూఎస్‌పీ మండల అధ్యక్షుడు డి.రామారావు, డీకే ప్రసాద్ మల్లిపురం భాగ్యలక్ష్మి, మల్లిపురం శ్రీను, ఆజారి రామారావు పాల్గొన్నారు.