ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ కేంద్రంలో డిప్లమో కోర్సులు

ABN , First Publish Date - 2021-08-10T05:30:56+05:30 IST

ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ కేంద్రంలో డిప్లమో కోర్సులు

ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ కేంద్రంలో డిప్లమో కోర్సులు

గుజరాతీపేట : విశాఖలో గల ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ కేంద్రంలో అడ్వాన్స్‌డ్‌ డిప్లొమో కోర్సులు నిర్వహిస్తున్నట్టు ఆ కేంద్రం డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ జి.ప్రసాద్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అచ్యుతాపురం ఎస్‌సీజెడ్‌లో 20 ఎకరాల స్థలంలో ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ కేంద్రం నెలకొల్పినట్టు చెప్పారు. ఏడీఎంఎం, ఏడీఎంఐఎ కోర్సులను ఈ విద్యా సంవత్సరానికి రెగ్యులర్‌ కోర్సులుగా అందిస్తున్నట్టు చెప్పారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని తెలిపారు. వివరాలకు 9949319237, 9515397553 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

 

Updated Date - 2021-08-10T05:30:56+05:30 IST