శిథిలావస్థలో పాఠశాలల భవనాలు
ABN , First Publish Date - 2021-08-25T05:38:01+05:30 IST
శిథిలావస్థలో పాఠశాలల భవనాలు

గార: మండలంలోని వమరవిల్లి పంచాయతీ ఎస్‌బీఎన్‌పేట, హుకుంపేట, తోణంగి పంచాయతీ బచ్చుపేట ప్రాథమిక పాఠశాలల భవనాలు శిథిలావస్ధకు చేరుకున్నాయి. దీంతో విద్యార్థులు, ఉపా ధ్యాయులు ఇబ్బందులు పడుతు న్నారు. బచ్చుపేట పాఠశాలలో 40మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాల భవనం పాడైపోవడంతో సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఎన్‌బీఎన్‌పేట పాఠశాల భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. నాలుగేళ్ల కిందట గ్రామస్థుల విరాళాలతో కొత్తగా ఒక గదిని నిర్మించుకొని అందులో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ సుమారు 50 మంది విద్యార్థులు చదువుతున్నారు. హుకుంపేట పాఠశాలది కూడా ఇదే పరిస్థితి. ఈ పాఠశాలలో సుమారు 40 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ మూడుచోట్ల కొత్త భవనాలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావును, సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేసినట్లు ఎంపీటీసీ మాజీ సభ్యురాలు సుగ్గు లక్ష్మీనరసింహదేవి, వమరవిల్లి సర్పంచ్ సుగ్గు లక్ష్మీబాయి తెలిపారు.