ఒంగోలు డెయిరీ ఉద్యోగ సంఘ నేత వెంకటశేషయ్య హఠాన్మరణం

ABN , First Publish Date - 2021-07-25T05:16:40+05:30 IST

ఒంగోలు డెయిరీ ఉద్యో గుల సంఘ నేతగా, టీడీపీ అనుబంధ కార్మిక సంఘం టీఎన్‌టీయూ సీ ముఖ్యుడిగా, ఒంగోలు ప్రాంతంలోని వివిధ వర్గాలకు సుపరిచితు డైన రావి వెంకటశేషయ్య(57) హఠాన్మారణం చెందారు.

ఒంగోలు డెయిరీ ఉద్యోగ సంఘ నేత వెంకటశేషయ్య హఠాన్మరణం
వెంకటశేషయ్య (ఫైల్‌)

వీఆర్‌ఎస్‌ బెనిఫిట్స్‌ అందక మానసిక క్షోభ

ఆర్థిక ఒత్తిడితో మృతిచెందారని ఉద్యోగ సంఘ నాయకుల ఆరోపణ

ఒంగోలు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు డెయిరీ ఉద్యో గుల సంఘ నేతగా, టీడీపీ అనుబంధ కార్మిక సంఘం టీఎన్‌టీయూ సీ ముఖ్యుడిగా, ఒంగోలు ప్రాంతంలోని వివిధ వర్గాలకు సుపరిచితు డైన రావి వెంకటశేషయ్య(57) హఠాన్మారణం చెందారు. మద్దిపాడు మండలం రాచవారిపాలెంకు చెందిన వెంకటశేషయ్య డెయిరీలో దీర్ఘ కాలంగా పని చేస్తున్నారు. తొలుత కంభం పాలశీతల కేంద్రంలో త ర్వాత రెండు దశాబ్దాలుగా ఒంగోలులోని డెయిరీలో పనిచేశారు. డెయి రీ నిర్వహణలో ప్రధానమైన పాలపొడి ఫ్యాక్టరీ రన్నింగ్‌లో కీలకంగా పనిచేసిన ఆయన డెయిరీ ఉద్యోగుల సంఘం కార్యదర్శిగా పనిచేశా రు. అలాగే టీఎన్‌టీయూసీ జిల్లా కార్యదర్శిగా చేశారు. కాగా ఒంగోలు డెయిరీ కార్యకలాపాలు నిలిచిపోయే వరకు అందులోనే పనిచేసిన వెంకటశేషయ్య ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన వీఆర్‌ఎస్‌ తీసుకు న్నారు. అప్పటి నుంచి ఒంగోలులో నివాసం ఉంటున్న ఆయన ఇటీవ ల కొంత అనారోగ్యంతో  బాధపడుతున్నారు. విజయవాడలో ఉద్యోగం చేస్తున్న తన కుమార్తెకు వచ్చేనెలలో వివాహం జరగనున్న నే పథ్యంలో నెలరోజులుగా అక్కడే ఉంటున్నారు. 

అయితే కుమార్తె వివాహం ఖరారు అయినా డెయిరీ నుంచి రావాల్సిన పెండింగ్‌ జీతాలు, ఇతరత్రా ఆర్థిక వనరులు అంద కపోవడంతో కూడా కొంత మానసిక వ్యధచెందినట్లు సమాచా రం. ఈనేపథ్యంలో శుక్రవారం అర్థరాత్రి గుండెపోటు రావడం తో విజయవాడలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స అందించే లోపే మరణించారు. ఆయన స్వగ్రామమైన రాచవారిపాలెంలో శని వారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి.  ఈ సందర్భంగా టీఎ న్‌టీయూసీ రాష్ట్ర నాయకులు చుండూరి వెంకటేశ్వర్లు, డెయిరీ ఉద్యో గుల పోరాట కమిటీ కన్వీనర్‌ జి.నారాయణరావు తదితరులు వెంకట శేషయ్య భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. 

కాగా వెంకటశేషయ్య మరణానికి ఆర్థికపరమైన వత్తిడే ప్రధాన కారణంగా డెయిరీ ఉద్యోగుల సంఘనేత నారాయణరావు తెలిపారు. కుమార్తె పెండ్లి సమీపిస్తుండగా డెయిరీ నుంచి రావాల్సిన బెనిఫిట్స్‌ అందకపోవడంతో ఆందోళన చెందారని చెప్పారు. ఇలా వీఆర్‌ఎస్‌ తర్వాత ఆర్థిక వత్తిడీకి గురై చనిపోయిన వారిలో వెంకటశేషయ్య మూడవ వారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించి ఉద్యోగులకు అందాల్సిన బకాయిలు రూ.26 కోట్లను అంద జేయాలని నారాయణరావు కోరారు. 

Updated Date - 2021-07-25T05:16:40+05:30 IST