విద్యతోనే అభివృద్ధి సాధ్యం: స్పీకర్‌

ABN , First Publish Date - 2021-12-08T05:11:50+05:30 IST

: విద్యతోనే అభి వృద్ధి సాధ్యమని స్పీకర్‌ తమ్మి నేని సీతారాం తెలిపారు.

విద్యతోనే అభివృద్ధి సాధ్యం: స్పీకర్‌
మాట్లాడుతున్న స్పీకర్‌ సీతారాం


పొందూరు: విద్యతోనే అభి వృద్ధి సాధ్యమని  స్పీకర్‌ తమ్మి నేని సీతారాం తెలిపారు. మంగళ వారం పొందూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను  ప్రారంభించా రు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ పొందూరుకు త్వరలో బీసీ రెసిడెన్షియల్‌ కళా శాల మంజూరుకానుందని చెప్పా రు. ఉన్నత విద్యాశాఖ  కమిషనర్‌ పోలా భాస్కర్‌ మాట్లాడుతూ ఉన్నత విద్యను ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి  ఒక నూతన డిగ్రీ కళాశాలను మంజూరుచేశామన్నారు.  కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ మాట్లాడుతూ  డిగ్రీ కళాశాలలకు ఐదెకరాల  భూమి కేటాయిం చామని చెప్పారు. జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్‌, విక్రాంత్‌, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, గొర్లె కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అంబేద్కర్‌ వర్సిటీ వీసీ నిమ్మ వెంకటరావు, ఉన్నత విద్యాశాఖ ఆర్జేడీ సీహెచ్‌ కృష్ణ, వైసీపీ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్‌, సర్పంచ్‌ ఆర్‌.లక్ష్మి, ఎంపీపీ కె.ఉషారాణి, జడ్పీటీసీ ఎల్‌.కాంతారావు  పాల్గొన్నారు.
Updated Date - 2021-12-08T05:11:50+05:30 IST