ఓటీఎస్‌ పేరుతో నిర్బంధ వసూలు నిలిపివేయాలి

ABN , First Publish Date - 2021-12-26T05:53:55+05:30 IST

ఓటీఎస్‌ పేరుతో నిర్బంధ వసూలు నిలిపివేయాలి

ఓటీఎస్‌ పేరుతో నిర్బంధ వసూలు నిలిపివేయాలి
మాట్లాడుతున్న రవికుమార్‌

కంచిలి: ఓటీఎస్‌పేరుతో పేదల నుంచి నిర్బంధ వసూళ్లు తక్షణమే నిలిపివేయాలని టీడీపీ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ డిమాండ్‌చేశారు. శనివారం కంచిలిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ  పేదల మెడకు ఓటీఎస్‌ పేరుతో వైసీపీ ప్రభుత్వం ఉరితాడుగా మారుస్తోందని ఆరో పించారు. ఎప్పుడో కట్టుకున్న ఇళ్లకు సొమ్ములు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం తగదన్నారు.  పేదలకు ఇచ్చిన రుణాలను ఏ ప్రభుత్వం వసూలుకు చేయలేదని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి చెప్పిన మాటలకు చేతలకు పొంతన లేకుండా  పరిపాలన సాగుతోందని తెలిపారు. సమావేశంలో టీడీపీ మండలాధ్యక్షుడు బి.కురయ్య, నాయకులు బి.కామేష్‌రెడ్డి, జగదీష్‌పట్నాయక్‌, ఎం.పూర్ణ, వి.రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-26T05:53:55+05:30 IST