ఆర్బీకేలో సామగ్రి ధ్వంసం

ABN , First Publish Date - 2021-10-07T06:06:37+05:30 IST

ఆర్బీకేలో సామగ్రి ధ్వంసం

ఆర్బీకేలో సామగ్రి ధ్వంసం
కియోస్కో యంత్రాన్ని ధ్వంసం చేసిన దృశ్యం

వంగర: కొప్పరవలస రైతుభరోసా కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో దుండగులు చొరబడి విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. ఆర్బీకే తాళాలను పగులగొట్టి వారు లోపలకు ప్రవే శించారు. కియోస్కో యంత్రాన్ని పగులగొట్టడంతో పాటు టెలివిజన్‌ ప్రాజెక్టర్‌, విలువైన పత్రాలను చిందరవందర చేశారు.  బుధవారం విధులకు హాజరైన సిబ్బంది దీన్ని గమనించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. వారి ఆదేశాల మేరకు కార్యదర్శి గోవింద్‌తో పాటు పలువురు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ నవీన్‌, ఎస్‌ఐ దేవానంద్‌లు సంఘ టనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు.   ఆకతాయిల పనిగా భావించి ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు తెలిపారు.   

Updated Date - 2021-10-07T06:06:37+05:30 IST