అప్రజాస్వామిక విధానాలపై నిలదీయండి

ABN , First Publish Date - 2021-11-23T05:45:14+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై నిలదీయాలని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి పిలుపునిచ్చారు. సోమవారం పలాస ఇందిరా జంక్షన్‌ నుంచి కాశీబుగ్గ మూడురోడ్ల జంక్షన్‌ వరకు జనజాగరణ యాత్ర, ర్యాలీ నిర్వహించారు.

అప్రజాస్వామిక విధానాలపై నిలదీయండి
జనజాగరణ యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

డీసీసీ అధ్యక్షురాలు సత్యవతి 

పలాస, నవంబరు 22: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై నిలదీయాలని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి పిలుపునిచ్చారు. సోమవారం పలాస ఇందిరా జంక్షన్‌ నుంచి కాశీబుగ్గ మూడురోడ్ల జంక్షన్‌ వరకు జనజాగరణ యాత్ర, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆదివాసీలపై దేశవ్యాప్తంగా లైంగిక దాడులు పెర గడంపై ఆందోళన వ్యక్తంచేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి రవాణా రంగాన్ని సర్వనాశనం చేశారని, గ్యాస్‌ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు తంగుడు వీర్రాజు, సురేష్‌, మధు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-11-23T05:45:14+05:30 IST