జిల్లాకు చేరిన కరోనా వ్యాక్సిన

ABN , First Publish Date - 2021-01-14T05:15:43+05:30 IST

జిల్లాకు కరోనా వ్యాక్సిన వచ్చిందని, 24 వేల మంది హెల్త్‌ కేర్‌ వర్కర్లకు వేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైందని జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత వర్మ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కొవిడ్‌-19 వ్యాక్సినేషన మొదటి విడత ప్రక్రియను ఈ నెల 16 నుంచి 20వ తేది వరకు చేపట్టనున్నామని తెలిపారు.

జిల్లాకు చేరిన కరోనా వ్యాక్సిన

జేసీ సాయికాంత వర్మ

కడప(కలెక్టరేట్‌), జనవరి 13: జిల్లాకు కరోనా వ్యాక్సిన వచ్చిందని, 24 వేల మంది హెల్త్‌ కేర్‌ వర్కర్లకు వేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైందని జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత వర్మ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కొవిడ్‌-19 వ్యాక్సినేషన మొదటి విడత ప్రక్రియను ఈ నెల 16 నుంచి 20వ తేది వరకు చేపట్టనున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 24,500 మంది హెల్త్‌ కేర్‌ వర్కర్లు కోవిన వెబ్‌సైట్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. వీరందరికీ ఎంపిక చేసిన 20 కేంద్రాల్లో రోజుకు 100 మందికి చొప్పున టీకాలు వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచఓ డాక్టర్‌ అనిల్‌కుమార్‌, డీసీహెచఎస్‌ డాక్టర్‌ శ్రీధర్‌, టైమ్‌లైన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నగేష్‌, ఎనహెచఎం ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ లక్ష్మీకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-14T05:15:43+05:30 IST