సీతంపేట ఐటీడీఏలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2022-01-01T04:53:46+05:30 IST

సీతంపేట ఐటీడీఏలో కరోనా కలకలం

సీతంపేట ఐటీడీఏలో కరోనా కలకలం

సీతంపేట, డిసెంబరు 31 : ఐటీడీఏ అనుబంధంగా పనిచేస్తున్న ఓ కీలకశాఖ అధికారి కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఐటీడీఏ సిబ్బందిలో అలజడి నెలకొంది. నిత్యమూ ఆ శాఖా కార్యాలయానికి ఎంతో మంది వచ్చి పోతుంటారు. అంతేకాకుండా ఇటీవల కొన్ని ప్రారంభోత్సవాల్లో కూడా ఆ అధికారి పాల్గొన్నారు. దీంతో ఏం జరుగుతుందోననే సర్వత్రా భయాందోళన నెలకొంది. ఆ అధికారికి కూడా కరోనా పాజిటివ్‌ అని వైద్యులు ధ్రువీకరించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. 

Updated Date - 2022-01-01T04:53:46+05:30 IST