రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి సహకరించండి

ABN , First Publish Date - 2021-08-26T05:06:18+05:30 IST

శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు కోరారు.

రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి సహకరించండి
పనులకు శంకుస్థాపన చేస్తున్న రామ్మోహన్‌నాయుడు

  ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు

ఆమదాలవలస రూరల్‌: శ్రీకాకుళం  రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు కోరారు. బుధవారం రైల్వేస్టేషన్‌లో రూ.4కోట్లతో నిర్మించనున్న ఫుట్‌వే బ్రిడ్జికి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  దేశంలోనే తలమానికంగా  స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో ఆమదాలవలస రైల్వేస్టేషన్‌లో బ్రిడ్జి నిర్మించనున్నట్లు తెలిపారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా స్టేషన్‌ పరిసరప్రాంతాల్లో చెత్త  లేకుండా చూడాల్సి బాధ్యత  అధికారులతోపాటు  ప్రయాణికులపై ఉందన్నారు. రైల్వేఅండర్‌ టన్నెల్‌లో నీరు నిల్వఉండడంపై సిటిజన్‌ ఫోరం నాయకుడు  బొడ్డేపల్లి మోహనరావు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రెండునెలల్లో సమస్యను పరిష్కారించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌, ఆ పార్టీ నాయకులు తమ్మినేని సుజాత, మొదలవలస రమేష్‌, బోర గోవిందరావు పాల్గొన్నారు. కాగా, ఈ పనుల శంకుస్థాపనకు స్పీకర్‌ తమ్మినేని సీతారాం హాజరుకాలేదు. అసలు ఆయనకు అధికారుల నుంచి ఆహ్వానం అందిందా? లేదా? అన్నది తెలియ లేదు. అధికారులు ప్రోటోకాల్‌ పాటించలేదని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు. 
 


Updated Date - 2021-08-26T05:06:18+05:30 IST