కూరగాయల సాగుతో నిరంతర ఆదాయం

ABN , First Publish Date - 2021-10-07T06:05:44+05:30 IST

కూరగాయల సాగుతో నిరంతర ఆదాయం

కూరగాయల సాగుతో నిరంతర ఆదాయం
మాట్లాడుతున్న కృష్ణారావు

ఆమదాలవలస : చిన్న, సన్నకారు రైతులు కూరగాయల పంటలతో నిరంతరం ఆదాయం పొందవచ్చని ఆత్మ పఽథకం సంయుక్త సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. బుధవారం ఆమదాలవలస కృషివిజ్ఞాన కేంద్రంలో యువ రైతులకు కూరగాయల సాగు, పంటకోత తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెలకువలు పాటిస్తే లాభాలు పొందవచ్చన్నారు. కేవీకే శాస్త్రవేత్త డి.చిన్నంనాయుడు మాట్లాడుతూ కూరగాయల రైతులు  సేంద్రియ విధానాలు అవలంబించాలని తెలిపారు.  శాస్త్రవేత్తలు జి.చిట్టిబాబు  భాగ్యలక్ష్మి,  సూక్ష్మనీటి యాజమాన్య సంస్థ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-07T06:05:44+05:30 IST