జిల్లా కబడ్డీ మహిళ జట్టుకు అభినందన

ABN , First Publish Date - 2021-11-10T05:04:21+05:30 IST

రాష్ట్రస్థాయి సీనియర్‌ కబడ్డీ పోటీలో తృతీయ స్థానం పొందిన జిల్లా జట్టును డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అభినందించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రతిభ చూపిన జట్టు సభ్యులను అభినందించారు.

జిల్లా కబడ్డీ మహిళ జట్టుకు అభినందన
జిల్లా కబడ్డీ మహిళ జట్టును అభినందిస్తున్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌

నరసన్నపేట: రాష్ట్రస్థాయి సీనియర్‌ కబడ్డీ పోటీలో తృతీయ స్థానం పొందిన జిల్లా జట్టును డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అభినందించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రతిభ చూపిన జట్టు సభ్యులను అభినందించారు. ఇటీవల విశాఖ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో ప్రతిభ కనపరిచిన కబడ్డీ జట్టు రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు పొందాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షుడు కరిమి రాజేశ్వరరావు,  జిల్లా కబడ్డీ అసోషియేషన్‌ అధ్యక్షుడు వెంకన్న చౌదరి, కార్యదర్శి చిరంజీవిరావు, కోచ్‌ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-11-10T05:04:21+05:30 IST